- Advertisement -

విజయ్-రష్మికా..ఆస్తుల వివరాలు!

- Advertisement -

‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా జంట ఇప్పుడు నిజ జీవితంలో అడుగుపెట్టబోతోందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట ఫిబ్రవరి 2026లో వివాహం చేసుకోనుందని తెలుస్తోంది. వారి ప్రేమ గాసిప్‌లు గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నప్పటికీ, విజయ్ కానీ, రష్మిక కానీ తమ రిలేషన్ షిప్, ఎంగేజ్‌మెంట్‌పై బహిరంగంగా స్పందించలేదు.

అయితే మీడియా నివేదికల ప్రకారం, వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్‌గా జరిగింది. ఎటువంటి మీడియా హడావుడి లేకుండా, సన్నిహిత వాతావరణంలో ఈ వేడుక నిర్వహించారని తెలుస్తోంది.

వీరి ఎంగేజ్‌మెంట్ తర్వాత విజయ్ – రష్మికా ఆస్తుల వివరాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయ్ హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో రూ. 15 కోట్లు విలువైన అద్భుతమైన భవంతిలో నివసిస్తున్నారు.

విజయ్ దేవరకొండకు ఉన్న లగ్జరీ కార్లు ఇవి –

BMW 5 సిరీస్ – రూ. 65–68 లక్షలు

ఫోర్డ్ మస్టాంగ్ – రూ. 75 లక్షలు

రేంజ్ రోవర్ – రూ. 64 లక్షలు

వోల్వో XC90 – రూ. 85 లక్షలు

అదనంగా, ఆయనకు ప్రైవేట్ జెట్ కూడా ఉందని చెబుతున్నారు. 2025 నాటికి విజయ్ దేవరకొండ నికర ఆస్తులు రూ. 50–70 కోట్ల మధ్య ఉన్నాయి.
ఆయన ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు రూ. 1 కోటి కంటే ఎక్కువ, అలాగే ఒక్కో స్పాన్సర్డ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి రూ. 40 లక్షల వరకు సంపాదిస్తున్నారని సమాచారం.
తనకంటూ ఉన్న దుస్తుల బ్రాండ్ ద్వారా కూడా ఆయన ఆదాయం పొందుతున్నారు.

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ రష్మిక తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.ఫోర్బ్స్ ప్రకారం, ఆమె నికర ఆస్తులు రూ. 66 కోట్లు. పుష్ప 2: ది రూల్ సినిమాలో ఆమె పాత్రకు రూ. 10 కోట్లు పారితోషికం పొందిందని, సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 4 కోట్లు తీసుకుంటుందని తెలుస్తోంది.

రష్మికకు –బెంగళూరులో రూ. 8 కోట్ల విలువైన లగ్జరీ హౌస్,అలాగే ముంబై, గోవా, కూర్గ్, హైదరాబాద్ల్లో కూడా ఆస్తులు ఉన్నాయి.

ఆమెకు ఉన్న లగ్జరీ కార్ల జాబితా:

ఆడి Q3

రేంజ్ రోవర్ స్పోర్ట్

టయోటా ఇన్నోవా

హ్యుందాయ్ క్రెటా

మెర్సిడెస్-బెంజ్ C-క్లాస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -