జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
ఇప్పటికే దసరా తర్వాత పార్టీపై ఫోకస్ చేస్తానని ప్రకటించిన జనసేనాని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సేనతో సేనాని సమావేశం అనంతరం త్వరలో జనసేన పార్టీ త్రిశూల్ వ్యూహంతో ముందుకెళ్దామని ప్రకటించారు పవన్.
త్రిశూల్ లో మూడు అంచెలుగా పార్టీని బలోపేతం చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల సమస్యలు, త్వరలో పవన్ చేపట్టనున్న జిల్లాల పర్యటనలపై చర్చ జరిగింది. కొన్ని చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇంచార్జ్ లతో విభేదాలు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పవన్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
