Wednesday, May 15, 2024
- Advertisement -

హీరోల వారస‌త్వంపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌…!

- Advertisement -

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు దాదాపు అంద‌రు వార‌స‌త్వ‌పు హీరోలే ఉన్నారు.ఇక తెలుగు ఇండ‌స్ట్రీలో అయిన ఈ వార‌స‌త్వం అనేది కాస్తా ఎక్కువుగానే ఉంది. ఆ నాటి ఎన్టీఆర్ నుంచి ఈ నాటి జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ర‌కు అంద‌రు వార‌స‌త్వం మీద ఆధార‌ప‌డి వ‌చ్చి హీరోలు అయిన వాళ్లే.తెలుగులో ఎటువంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చిన వారిలో చాలా త‌క్కువ మంది ఉన్నారు.ఈ త‌రం హీరోల‌లో నాని త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌డే ఎటువంటి ఫిలిం బేస్ ఫ్యామిలీ లేకుండా వ‌చ్చాడు.విజ‌య్ దేవ‌కొండ త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.చాల‌మంది విజ‌య్‌ది ల‌క్ ఫేవ‌ర్ అంటున్నారు.ఈ వాఖ్య‌ల‌పై స్పందించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

నేను చాలా క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాను.కెరీర్ స్టార్టింగ్‌లో రోల్స్ కోసం నేను చాల‌మంది చూట్టునే తిరిగాను అంటూ చెప్పుకొచ్చాడు.ఈ సంద‌ర్భంగా హీరోల వార‌స‌త్వంపై కూడా కామెంట్స్ చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ”సినిమా అనేది వ్యాపారం. ఒకరిపై డబ్బు పెట్టి సినిమా తీస్తున్నారంటే నిర్మాత ఆలోచించడంలో తప్పేముంది. బ్యాగ్రౌండ్ ఉన్న హీరో అయితే ఫ్యాన్స్ సపోర్ట్ తో పాటు.. సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగా వస్తాయి. బ్యాగ్రౌండ్ లేని హీరోలతో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాతలు వారసత్వ హీరోలపైనే మక్కువ చూపుతుంటారని” చెప్పుకొచ్చాడు.ఇక్క‌డ బ్యాగ్రౌండ్ ఒక‌టి ,రెండు సినిమాల‌కు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంది.త‌రువాత మ‌న సొంత టాలెంట్ మీదే ఆధార‌ప‌డాలి అని తెలిపాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.అత‌ను న‌టించిన నోటా సినిమా ఈ నెల 5న విడుదల కానుంది.ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ యంగ్ సీఎంగా క‌నిపించ‌నున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -