Thursday, May 16, 2024
- Advertisement -

ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి మ‌ర‌చిపోండి – విజయ్ దేవరకొండ

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీకి టాప్ గేర్‌లో దూసుకొచ్చిన హీరో విజ‌య్ దేవ‌రకొండ‌.పెళ్లి చూపులు,అర్జున్ రెడ్డి,గీతా గోవిందం వంటి సినిమాల‌తో సెక్సెస్ కొట్టాడు విజ‌య్.అత‌ను న‌టించిన తాజా చిత్రం నోటా ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సందర్భంగా విజయ్ మీడియాతో పలు అంశాలపై ముచ్చటించాడు. నోటా సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నై, కొచ్చి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశానని విజయ్ చెప్పాడు. ఇక ఇటీవల ఓ విదేశీ యువతితో దిగిన పలు ఫొటోల విషయంపై కూడా విజయ్ స్పందించాడు.

ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి చాలా మంచిదని విజయ్ కితాబిచ్చాడు. ఆ అమ్మాయి గురించి ఏం అడ‌గ‌వ‌ద్ద‌ని మీడియాను వేడుకున్నాడు విజ‌య్ .బెల్జియం దేశానికి చెందిన ఓ యువతితో విజయ్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి మిలానే డిన్నర్ చేస్తున్న ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.విజ‌య్ దేవ‌ర‌కొండ ఎందుకు ఆ అమ్మాయి విష‌యంలో మౌనం వ‌హిస్తున్నాడో ఎవ‌రికి అర్థం కావ‌డం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -