Tuesday, May 21, 2024
- Advertisement -

‘టాక్సీవాలా’ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మ‌రో హిట్ ఇస్తుందా…?

- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన టాక్సీవాలా సినిమా ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉంది.వాయిదాల మీద వాయిదాలు ప‌డుతు వ‌స్తుంది.మొత్త‌నికి విడుద‌ల తేదీని ఫిక్స్ చేసుకుంది ఈ సినిమా. ‘టాక్సీవాలా’ ఈ నెల 17న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం పాటలు హిట్ టాక్ తెచ్చుకోగా, నిన్న జరిగిన  కార్యక్రమంలో చిత్ర ట్రైల‌ర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. ట్రైల‌ర్‌ను చేస్తుంటే హార‌ర్‌లాగా అనిపిస్తుంది.గా, ‘నీ యబ్బ… జాబ్ చూడరా అంటే జిమ్నాస్టిక్స్ చేయిస్తావేంట్రా’ అంటున్న విజయ్ డైలాగ్ అలరిస్తోంది.

ఆపై అతను ఓ కారును కొనడం, టాక్సీవాలాగా మారడం, హీరోయిన్ తో పరిచయం, ఆమె మందు కొట్టి పడిపోతే, “నేను మంచోడిని కాబట్టి సరిపోయింది కానీ…” అంటున్న విజయ్ కనిపిస్తున్నాడు. ఆపై ఓ పాట, కొన్ని సీన్స్, ఇందులో చూపారు. “ఇది వినడానికి విచిత్రంగానే ఉంటది. కానీ నమ్మండి”… “కారులో దెయ్యం ఉంది” అని విజయ్ చెప్పడం సినిమా హారర్ జోనర్ ను టచ్ చేసింది. విడుద‌ల‌కు ముందే సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం అయిన ఈ సినిమా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మ‌రో హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -