Monday, May 13, 2024
- Advertisement -

మ‌రోసారి త‌న స్టామినా నిరుపించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోసారి త‌న స్టామినా నిరుపించుకున్నాడు.త‌న‌ది ల‌క్ ఫేవ‌ర్ కాద‌ని ,హార్డ్ వ‌ర్క్ వ‌ల్ల వ‌చ్చిన ఫ‌లిత‌మ‌ని నిరుపించుకున్నాడు విజ‌య్ దేవ‌రకొండ‌.ఆయన న‌టించిన తాజా చిత్రం టాక్సీవాలా గ‌త శ‌నివారం విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. సినిమాకు విడుద‌ల‌కు ముందే ఆన్‌లైన్ హెచ్‌డీ ప్రింట్ ప్ర‌త్య‌క్షం కావ‌డంతో చిత్ర యూనిట్ సినిమాపై ఆశ‌లు వ‌దులుకున్నారు.కాని విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం సినిమాలో కంటెంట్‌ని నమ్మి సినిమా ప్ర‌మోష‌న్స్‌ని త‌న‌దైన స్టైల్లో చేశాడు.సినిమా మొద‌టి ఆట‌కే సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.

మొదటి రోజు టాక్సీ వాలా వరల్డ్ వైడ్ గా 10.5కోట్లను కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా తెలిపింది. ఇక రెండో రోజు ఆదివారం కూడా ఈ సినిమా 7 కోట్ల 87 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన‌ట్లు చిత్ర నిర్మాత ప్ర‌క‌టించారు. మ‌రో వారం రోజుల‌పాటు పెద్ద సినిమాలు లేక‌పోవ‌డంతో టాక్సీవాలాకు ఎదురులేద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ భావిస్తున్నారు.వ‌చ్చే వారం ర‌జినీకాంత్ 2.0 సినిమా విడుద‌ల కానుంది. అప్ప‌టి వ‌రకు విజ‌య్ దేవ‌ర‌కొండ టాక్సీవాలా క‌లెక్ష‌న్స్‌కు ఎవ‌రు అడ్డుక‌ట్ట వేయ‌ల‌రని విజ‌య్ ఫాన్స్ చెబుతున్నారు. విజయ్ మార్కెట్ సినిమా సినిమాకు పెరుగుతోందని టాక్సీ వాలా నిరూపించింది. హార్ర‌ర్‌,కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -