Friday, May 3, 2024
- Advertisement -

విజ‌య దేవ‌ర‌కొండ టాక్సీవాలా ప్రీలుక్‌…

- Advertisement -

ఒక్క సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించాడు. ‘అర్జున్‌రెడ్డి’ హిట్‌ తరువాత విజ‌య్‌కు దాదాపు డ‌జ‌న్ సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే వాట‌న్నింటికి ఒకే చెప్పి ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క రోజు తీరిక లేకుండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో కొత్త దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌తో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు.

ఆ త‌ర్వాత ఈ సినిమా ప్రీలుక్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ లుక్‌ను విజ‌య్‌దేవ‌ర‌కొండ త‌న ట్విట్ట‌ర్‌లో ఇట్స్ టైమ్‌.. ఐయామ్ బ్యాక్ అని ట్వీట్ చేస్తూ ఆ లుక్‌ను విడుద‌ల చేశారు. ఆ లుక్‌లో పాతకాలం నాటి కారు దుమ్మురేపుతూ దూసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది.

వినూత్న క‌థాంశంతో తీస్తున్న ఈ సినిమాలో విజయ్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా కనిపించనున్నట్టు స‌మాచారం. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాకు ‘టాక్సీవాలా’ అనే పేరును పరిశీలిస్తున్నారు.

ఈ సినిమాను జీఏ-2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజ‌య్ ప‌క్క‌న హీరోయిన్‌గా ప్రియాంకా జవాల్కర్ నటిస్తోంది. ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండ, లావణ్య త్రిపాఠి జంట‌గా పరశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో న‌టిస్తుండ‌గా, ‘మహానటి’ సావిత్రి జీవిత‌క‌థ సినిమాలో విజయ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -