Sunday, May 19, 2024
- Advertisement -

రష్మిక కోసం బ్రహ్మాండమైన ప్లాన్ వేసిన విజయ్

- Advertisement -

కింగ్ ఆఫ్ ధీ హిల్ అనే సినిమా నిర్మాణ సంస్థ ని ప్రారంభించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఆ నిర్మాణ సంస్థ లో త్వరలో రానున్న చిత్రానికి సంబందించిన షూటింగ్ పనులని చూసుకుంటున్నాడు. ఒక కొత్త దర్శకుడిని ఈ సినిమా తో తెలుగు, తమిళం లో పరిచయం చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా లో తరుణ్ భాస్కర్, అనసూయ మరికొందరు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఇకపోతే అప్పుడే ఈ నిర్మాణ సంస్థలో రెండో సినిమా గురించిన చర్చ మొదలయింది.

అయితే రెండో సినిమా హీరోయిన్ ప్రధానం గా ఉండాలని విజయ్ అనుకుంటున్నాడట. అందులో భాగం గా ఈ సినిమా లో రష్మిక ని పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి చర్చ ఎప్పటి నుంచో జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు ఈ సినిమా పై అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ మౌనం గా ఉన్నారు. అయితే వరుసగా గ్లామర్ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో టాప్ స్థానం దాదాపు గా ఖరారు చేసుకున్న రష్మిక కి ఈ సమయం లో ఒక హీరోయిన్ ప్రధాన సినిమా కూడా ఉంటె బాగుంటుంది అని విజయ్ ఆలోచిస్తున్నాడట.

వీరు ఇరువురు నటించిన డియర్ కామ్రేడ్ సినిమా వచ్చే నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -