Wednesday, May 7, 2025
- Advertisement -

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘టాక్సీవాలా’

- Advertisement -

అర్జున్‌రెడ్డి సినిమా త‌రువాత హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ అమాంతం పెరిగింది.దీంతో త‌న త‌రువాత సినిమాల‌పై అంచ‌నాలు విప‌రీతంగా ఉన్నాయి.విజయ్‌ దేవరకొం‍డ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. విజయ్‌ సరసన మాళవిక నాయర్‌, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మే 18న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు.

అప్పటికి నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో టాక్సీవాలా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను జూన్‌ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే టాక్సీవాలా రిలీజ్‌ డేట్‌ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -