Friday, May 17, 2024
- Advertisement -

ఇదే నా డ్రీమ్ ప్రాజెక్టు?:మాళవిక

- Advertisement -

మాళవిక నాయర్..సూపర్ స్టార్ రజనీకాంత్ “పెట్టా” మరియు విజయ్‌తో “మాస్టర్” వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి మెప్పించారు. తాజాగా విక్రమ్‌తో కలిసి “తంగళన్”లో మెప్పించడానికి రెడీ అయ్యారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాళవిక.. తన అభిమానులతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కోరికలు, రాబోయే ప్రాజెక్ట్‌లపై వివరాలను వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించాలనే తన కోరిక అని తెలిపారు మాళవిక.

ఒక మహిళ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తే బాగుంటుందనేది తన కోరిక అని తెలిపారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా శిక్షణ పొందాను అని చెప్పుకొచ్చారు. తనకు వైవిధ్యమైన పాత్రలను పోషించడమంటే ఇష్టమని తెలిపిన మాళవిక…ది రాజా సాబ్‌ తెలుగు సినిమా చేస్తున్నానని తెలిపింది. ప్రభాస్‌తో నటించడం థ్రిల్‌గా ఉందని చెప్పగా ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా ఈ రెండు భారీ సినిమాలే కావడంతో భారీ ఆశలు పెట్టుకుంది మాళవిక.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -