Tuesday, May 7, 2024
- Advertisement -

ప్రముఖ నిర్మాత ని అవాయిడ్ చేస్తున్న విజయ్ దేవరకొండ

- Advertisement -

టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు కూడా ఒకరు. దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయాలని అనుకొని హీరో ఉండడు. చిన్న హీరో నుంచి స్టార్ హీరో వరకు అందరూ దిల్ రాజు నిర్మాణంలో కనీసం ఒక సినిమా అయినా చేయాలని ఆశిస్తుంటారు. కానీ ఇప్పుడు ఒక ప్రముఖ హీరో దిల్రాజు సినిమా ని కావాలని అవాయిడ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతనే విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ డేట్ల కోసం దిల్ రాజు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కానీ విజయ్ దేవరకొండ మాత్రం డేట్లను ఎడ్జెస్ట్ చేయలేక పోతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ కావాలనే ఇలా చేస్తున్నాడని తెలుస్తోంది. నిజానికి ఒక ప్రముఖ దర్శకుడు విజయ్ హీరోగా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. దిల్ రాజు ఆ సినిమా నిర్మించాల్సి ఉంది. కానీ దిల్ రాజు నిర్మాణంలో విజయ్ ఆ సినిమా చేయడని అర్థం చేసుకున్న దర్శకుడు ఇప్పుడు వేరే నిర్మాతల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ విజయ్ మాత్రం దిల్ రాజు సినిమా అంటే ఎందుకు ఆసక్తి చూపించడం లేదు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -