Thursday, May 16, 2024
- Advertisement -

కర్నాటక స్పీకర్ రాజీనామా…

- Advertisement -

కర్ణాటక స్పీకర్ సురేష్ కుమార్ రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర విధాన సభలో బలపరీక్షలో భాజాపా మూజువానీ ఓటుతో నెగ్గడంతో సభలోనె రమేశ్‌ కుమార్‌ స్పీకర్‌ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని కొంత మంది బీజేపీ నేతలు నిన్ననే వ్యాఖ్యానించారు. ఈలోగానే రమేష్‌కుమార్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో కొత్త స్పీకర్ రానున్నారు. తాత్కాలిక స్పీకర్‌గా కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.

రమేశ్‌ కుమార్‌ స్పీకర్‌ పదవిలో 14 నెలల 4 రోజుల పాటు కొనసాగారు. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమి ప్రభుత్వంలో రమేశ్‌ కుమార్‌ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకుని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి పని చేశాను అని స్పష్టం చేశానని రమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని సందర్భాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. స్పీకర్‌ పదవి వరించడం తన అదృష్టమన్నారు. ఈ చైర్‌కు ఎలాంటి అపఖ్యాతి తీసుకురాకుండా ప్రవర్తించాలన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -