Monday, April 29, 2024
- Advertisement -

విజయ్..’ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’

- Advertisement -

ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. విజయ్ కెరీర్‌లో ఇది 68వ సినిమా కాగా శరవేగంగా షుటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 5న సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు మేకర్స్.

విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా అంటే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏ జి ఎస్ ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్‌లో నటించనున్నారు. తండ్రి, కొడుకులుగా కనిపించనున్నారు. 1971లో డిబి కూపర్ అనే వ్యక్తి విమానంలో భారీ దొంగతనానికి పాల్పడి గాలిలో విమానం నుంచి పారాచ్యుట్ తో దూకేయగా ఇప్పటికి మిస్టరీగానే ఉండిపోయింది. దీనిని బేస్ చేసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -