Tuesday, April 30, 2024
- Advertisement -

వేసవి..మీ కరెంట్ బిల్లు ఇలా తగ్గించుకోండి!

- Advertisement -

వేసవి వచ్చిందంటే చాలు కరెంట్ బిల్లు మోత మోగిపోవాల్సిందే. ఉక్కపోత నుండి బయటపడేందుకు ఏసీలు,కూలర్‌లు, ఫ్యాన్‌లకు పనిచెబుతున్నారు. దీంతో గరిష్టా స్థాయిలో కరెంట్ వాడకం పెరిగిపోయింది. అలాగే విద్యుత్ బిల్లులు సైతం మోతమోగుతున్నాయి.

ఈ నేపథ్యంలో వేసవిలో కరెంట్‌ను ఆదా చేసుకునేందుకు అనేక తిప్పలు పడుతున్నారు ప్రజలు. కరెంట్ బిల్లులు తగ్గించుకోవాలనుకునే వారు ఈ చిట్కాలను పాటిస్తే చాలు.. ఇట్టే మీ విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చు.

పాత ట్యూబ్ లైట్లు, బల్బులును వాడుతుంటే వాటిని తీసేయండి. వీటికి బదులుగా ఎల్‌ఈడీ బల్బులను వాడండి. కరెంటు బిల్లును తగ్గించుకోవడానికి టీవీ, సెట్ టాప్ బాక్స్ లను ఆఫ్ చేయడానికి మెయిన్ ను ఆఫ్ చేయండి. ఏసీ వాడితే టైమర్ ను సెట్ చేయడం మంచిది. దీనివల్ల కరెంటు బిల్లు ఎక్కువరాకుండా ఉంటుంది.

ఇక ఫ్రీజ్‌ను ఖాళీగా లేకుండా నింపేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫ్రీజ్‌లోని వస్తువులు కూల్ కావడానికి ఎక్కువ విద్యుత్ శక్తి అవసరమవుతుంది. కాబట్టి అవసరమైన వస్తువులను మాత్రమే పెడితే కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది. అలాగే పాత ఫ్రిజ్,ఏసీలను పక్కనపెడితే మంచిది. మెయిన్ రూమ్ లేదా బెడ్ రూమ్ లో ఫ్రిజ్ ఉంచితే ఆ గదుల్లో మరింత వేడి బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా ఏసీ, ఫ్యాన్ వాడకం బాగా పెరుగుతుం కాబట్టి…వంటగదిలోనే ఫ్రిజ్‌ను ఉంచితే మంచిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -