Monday, May 13, 2024
- Advertisement -

మహేష్ బాబును కొట్టిన విజయశాంతి.. ఎందుకు ?

- Advertisement -

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు సూపర్ స్టార్ కృష్ణ సరసన కిలాడి కృష్ణుడు అనే సినిమా ద్వారా నటిగా పరిచయం అయింది విజయశాంతి. ఇక ఆ తర్వాత నుంచి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగిన ఆమె వాటిని సద్వినియోగం చేసుకొని మంచి హిట్స్ దక్కించుకుని దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించిన విజయశాంతి కొన్నాళ్ల తర్వాత రాజకీయ రంగంలోకి ప్రవేశించారు.

ఇక అప్పటినుండి రాజకీయాల్లోనే కొనసాగిన ఆమె ఇటీవల దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ద్వారా మళ్లీ నటిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు ఒప్పించడానికి చాలా రోజులుగా ప్రయత్నించారని రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నా ఆమె సరిలేరు నీకెవ్వరు భారతి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడని ఈ సినిమా తప్పకుండా ఆమెకు మంచి మూవీ అవుతుందని కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పడం జరిగింది.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తాజాగా దర్శకుడు విజయశాంతి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి తన అనుభవాలను ఇంటర్వ్యూ విజయశాంతి గతంలో కొన్నేళ్ళ క్రితం జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ విషయం ఏంటంటే మహేష్ బాబు బాలనటిగా ఉన్న సమయంలో అతనితో కలిసి నటించిన కొడుకు దిద్దిన కాపురం సినిమా షూటింగ్ సమయంలో ఒక సీన్ లో భాగంగా మహేష్ బాబు కొట్టవలసి వచ్చింది.

అయితే తాను మాత్రం మహేష్ ను కొట్టలేక పోయాను అని అన్నారు. కృష్ణ గారు తన వద్దకు వచ్చి ఈ సన్నివేశంలో మహేష్ బాబు చాలా పెద్ద తప్పు చేశాడు అది సహించలేక అతని చెంప దెబ్బ కొట్టాలి ఇప్పటికే చాలా టైడ్ అయిపోయా యి కొడతారా లేదా అని అడిగారు. మహేష్ బాబు కూడా మేడం మీరు కొట్టక పోతే నేనేమి అనుకోను అని చెప్పడంతో చివరికి చెంప దెబ్బ కొట్టానని తనకు ఎప్పటికీ గుర్తుండి పోతుందని విజయశాంతి గుర్తు చేసుకోవడం జరిగింది. ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహేష్ బాబు మీరు సూపర్ స్టార్ గా కొనసాగుతున్నప్పటికీ అందరితో కలుపుగోలుగా మాట్లాడతారని కూడా అందరినీ గౌరవిస్తారని విజయశాంతి మహేష్ బాబు వ్యక్తిత్వం గురించి సదరు ఇంటర్వ్యూలో బయట పెట్టడం విశేషమని చెప్పుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -