Monday, May 20, 2024
- Advertisement -

అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ కు పవన్ కళ్యాణ్..?

- Advertisement -

అల వైకుంఠపురములో సినిమాకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు, టీజర్లు యూత్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. థమన్ సంగీతం తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా సౌంత్ ఇండియా ప్రజలందరినీ ఆకట్టుకుంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం అల వైకుంఠపురములో చిత్రం ప్రీ రిలీజ్ వేడుక కు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు.

చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారిని ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారని తెలుస్తోంది. అయితే ఈ నెల 6 న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకని జరుపుకోనుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ ఒక స్టేజి పైనే కనిపిస్తే మెగా, పవర్ అభిమానులకు పండగే. అయితే ఈ చిత్ర వేడుకకి పవన్ తప్పకుండా వస్తారని చిత్ర యూనిట్ భావిస్తుంది.

మరో వైపు సోషల్ మీడియాలో అల్లు అర్జున్, పవన్ మధ్య విభేధాలు ఉన్నాయని.. పవన్ రారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని జనవరి 10 న విడుదల చేసేందుకు పట్టుబట్టారని ఫిలిం నగర్ లో వార్త చెక్కర్లు కొడుతుంది. దీనిపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించక పోగా, తాజాగా విడుదల చేసిన నూతన సంవత్సర పోస్టర్ లో ఎలాంటి తేదీని ప్రకటించలేదు. మరి ఈ పుకారు ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. ఇక అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -