తమిళ హీరో విజయ్ ,స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తోంది సర్కార్ సినిమా.గతంలో వీరిద్దరి నుంచి తపాకి,కత్తి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ఘనవిజయం సాధించడంతో ,సర్కార్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఎప్పటి నుంచో తెలుగు మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్న విజయ్ ఈ సినిమాను తెలుగులో కూడా గ్రాండ్‌గానే విడుదల చేస్తున్నాడు. సర్కార్ సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని 7 ఖండాల్లో ఉన్న 80 దేశాల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు.
అంటే దాదాపు 1200పైగా విదేశీ స్క్రీన్లలో సర్కార్ షో ప్రదర్శించబడనుంది. చూస్తుంటే ఫస్ట్ వీక్ లోనే సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఉందని సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. విజయ్ కెరీర్ లోనే ఈ స్థాయిలో ఏ సినిమా రిలీజ్ కాలేదు. అదే విధంగా అత్యధిక విదేశాల్లో ప్రదర్శించబడనున్న మొదటి సినిమా కూడా సర్కార్ కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా సినిమాను నవంబర్ 6న రిలీజ్ చేయనున్నారు.