విజయ్ లియోలో రామ్ చరణ్…

Ram Charan Special Appearance in Vijay’s Leo
Ram Charan Special Appearance in Vijay’s Leo

దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ హైప్‌తో తెరకెక్కుతున్నఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించింది. అక్టోబర్ 19, 2023న థియేటర్లలో విడుదల కానున్న పాన్-ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ లియో. అయితే కోలీవుడ్ సర్కిల్స్‌లో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. ఆదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించనున్నాడట.

తమిళ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఇప్పుడు ఈ వార్త హాట్ బజ్ క్రియేట్ చేస్తుంది. విజయ్ లియోలో రామ్ చరణ్ శక్తివంతమైన అతిధి పాత్రలో నటించనున్నారు. సోషల్ మీడియాలో రామ్ చరణ్ పాత్రపై ప్రేక్షకులు అనెక కథనాలు వస్తున్నాయి. నెటిజన్లు రామ్ చరణ్‌కు ఇందులో కీలకమైన పాత్ర ఉంటుందని భావిస్తున్నారు. విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ లాగా రామ్ చరణ్ అతిధి పాత్ర ఉంటుందని కథనాలు వస్తున్నాయి.

అయితే ఇటీవల రామ్ చరణ్ విజయ్, లోకేష్ కనగరాజ్‌లను భోజనానికి ఆహ్వానించగా, వారు అంగీకరించారు. అంతే దీంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే, ఇప్పటి వరకు దర్శకుడు లోకేష్ కనగరాజ్, లియో చిత్ర యూనిట్ ఈ ఊహాగానాలను ధృవీకరించలేదు అలాహని తిరస్కరించలేదు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియోలో విజయ్, త్రిషతో పాటు పెద్ద స్టార్ తారాగణం ఉంది, ఇందులో అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్, గౌతం మీనన్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు శాండీ ఉన్నారు. ఈ సినిమాపై తమిళంలోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. లియో అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.