విజయ్ సినిమా ‘పులి’ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో సంచలనమే సృష్టిస్తోంది. యూట్యూబ్ లో ఈ సినిమా కు యమ ఆదరణ లభిస్తోంది.యూ ట్యూబ్ లో పెట్టిన ఈ సినిమా టీజర్ ను కేవలం రెండు రోజుల్లో ఏకంగా నలభై లక్షల మంది వీక్షించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమా పట్ల నెటిజన్లలో ఎంత ఆసక్తి ఉందో చెప్పడానికి ఈ నంబర్ ఒకటే చాలు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలతో పోల్చుకొంటే పులిది రికార్డే అవుతుంది. చింబుదేవన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. గతంలో వడివేలును హీరోగా పెట్టి “హింసించే రాజు 23వ రాజు పులకేశి’ వంటి సినిమాను రూపొందించాడు. ఆ తర్వాత శంకర్ ప్రొడక్షన్ లో ‘గది నంబర్ 23లో దేవుడు’ అనే సినిమాను కూడా రూపొందించాడు. ఆ సినిమాలు తెలుగులో అంతగా ఆడలేదు. మరి ఈ నేపథ్యంలో ‘పులి’ వస్తోంది. ఈ సినిమాలో శ్రీదేవి ఒక ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం. మరి యూట్యూబ్ వరకూ ఈ సినిమా సంచలనాన్నే సృష్టిస్తోంది. థియేటర్లలో ఎంత సంచలనంగా మారుతుందో!