Friday, March 29, 2024
- Advertisement -

క్రిస్మస్ కానుకగా విక్రమ్ ‘కోబ్రా’సెకండ్ లుక్ విడుదల!

- Advertisement -

హీరో విక్రమ్ ప్రస్తుతం ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ‘కోబ్రా’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా సినిమాలో విక్ర‌మ్ లుక్‌కి సంబంధించి ఫొటోని విడుద‌ల చేశారు. ఇందులో గ‌జిబిజీ జుట్టుతో విక్ర‌మ్ క‌నిపిస్తుండ‌గా, అత‌డి మెదడులో అంకెలు, ఫార్ములాలు ఉన్న‌ట్టు చూపించారు. ప్రతి సమస్యకూ గణిత పరిష్కారం ఉంటుందని క్యాప్షన్ పెట్టారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా మేలో విడుదల కానుంది.

ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం.ఇందులో విక్ర‌మ్ 20కి పైగా పాత్ర‌ల‌లో నటిస్తున్న‌ట్టు టాక్. సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తున్న కోబ్రా సినిమా రూపుదిద్దుకుంటోంది. ర‌ష్యాలోనూ ఈ సినిమా షూటింగ్ గతంలో కొనసాగింది. ఇందులో టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా నటిస్తున్నాడు.

ఎస్‌ రవికుమార్‌, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.  వ‌చ్చే ఏడాది చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -