సూపర్ స్టార్ రజినీకాంత్ కి తీవ్ర అస్వస్థత!

- Advertisement -

భారతీయ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన వారిలో రజినీకాంత్ ఒకరు. తమిళ అభిమానులకు ఆరాద్య దైవంగా ఉన్న రజినీ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా నటిస్తున్నారు. లింగ చిత్రం భారీ ఫ్లాప్ అయినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తర్వాత కబాలీ,2.0,కాలా,దర్భార్ చిత్రాలతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో తన సొంత పార్టీ తరుపు నుంచి ఎన్నికల్లో నిలబడబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రజినీ నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ షూటింగ్ రెండు రోజుల క్రితం కరోనా కారణంగా వాయిదా పడింది. షూటింగ్ స్పాట్ లో 8 మందికి కరోనా రావడంతో ఈ షూటింగ్ వాయిదా పడింది. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఆ సమయంలో కరోనా పరీక్షల్లో రజినీకు నెగెటివ్‌గా నిర్థారణ అయ్యింది.

- Advertisement -

తాజాగా సూపర్‌స్టార్ రజనీ కాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో బాధపడుతున్న రజినీను శుక్రవారం ఉదయం జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఈ మేరకు హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రజినీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని అభిమానులు భగవంతున్ని ప్రార్థిస్తున్నారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News