Sunday, May 11, 2025
- Advertisement -

హాలీవుడ్ రేంజ్‌లో విక్ర‌మ్ ‘ధృవ నక్షత్రం’ టీజ‌ర్‌

- Advertisement -

చియాన్ విక్ర‌మ్ వారం తేడాలో రెండు సినిమా టీజ‌ర్స్‌ను విడుద‌ల చేశాడు.గ‌త‌వారం సామి-2 సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన విక్ర‌మ్‌,తాజాగా మ‌రో మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎప్ప‌టి నుండో తీస్తున్న సినిమా ధృవ నక్షత్రం.ఈ సినిమా మొద‌లుపెట్టి చాలాకాలం అయింది.అయితే అనుకొని కార‌ణాల‌తో సినిమా వాయిదా ప‌డింది.రీసెంట్‌గా సినిమా షూటింగ్ మళ్లీ మొద‌లు పెట్టారు.తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్‌చేశారు చిత్ర బృందం.హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించినట్లు అర్ధమవుతోంది.

అద్భుతమైన గన్ షాట్స్ ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. గ‌త కొంతకాలంగా విక్ర‌మ్‌కు సరైన హిట్లు లేవు.సామి-2,ధృవ నక్షత్రం సినిమాల‌పై న‌మ్మ‌కంతో ఉన్నాడు విక్ర‌మ్‌.ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతూ వర్మ న‌టిస్తుంది.రాధికా , సిమ్రాన్‌లు ముఖ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. మ‌రి ధృవ నక్షత్రం సినిమా ఈ ఏడాది విడుద‌ల అవుతుందో లేదో చూడాలి.మ‌రి ధృవ నక్షత్రం టీజ‌ర్ ఎలా ఉందో ఓసారి చూసేద్దాం రండీ!

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -