Sunday, April 28, 2024
- Advertisement -

విక్రమ్ ” రోలెక్స్ ” ఫుల్ మూవీ.. పూనకాలే !

- Advertisement -

ఇటీవల వచ్చిన తమిళ్ మూవీ ” విక్రమ్ ” పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి సంచలన విజయం నమోదు చేసిందో తెలిసిందే. కమల్ హాసన్ నటించిన ఈ మూవీ తమిళ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. అలాగే తెలుగు, హిందీ భాషల్లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాల్లో కమల్ హాసన్ కు ఏ స్థాయిలో పేరొచ్చిందో అంతే స్థాయిలో డైరెక్టర్ లోకేశ్ కనకారాజ్ కూడా పేరు సంపాధించుకున్నాడు. మూవీలో ఊర మాస్ ఎలిమెంట్స్ తో ” విక్రమ్ ” మూవీని తన టేకింగ్ తో ఆడియన్స్ ను ఫిదా చేశారు ఈ యంగ్ డైరెక్టర్.. మూవీ లో కమల్ హాసన్ తో పాటు విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాయద్ ఫజిల్ వంటి వారికి కూడా సమాన పాత్రలు కల్పించి అందరి పాత్రలు గుర్తుండిపోయేలా చేశాడు..

అయితే మూవీ అంతా ఒక ఎత్తు.. చివరి అయిదు నిముషాలు మరో ఎత్తూ.. డ్రగ్స్ కింగ్ రోలెక్స్ పాత్రలో సూర్య నటించి విశ్వరూపం చూపించాడు. క్యామియో రోల్ అయినప్పటికి రోలెక్స్ పాత్ర ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసింది. ఇక విక్రమ్ మూవీని మల్టీ యూనివర్స్ గా తెరకెక్కిస్తున్న లోకేశ్.. తన యూనివర్స్ లో రోలెక్స్ పైనే ఒక మూవీ ఉందట. ఇదే విషయాన్ని ఇటీవల కన్ఫర్మ్ చేశాడు లోకేశ్ కనకారాజ్. ఇప్పటికే లోకేశ్ యూనివర్స్ లో భాగంగా ఖైదీ 2, విక్రమ్ 2 .. సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. ఈ రెండు మూవీస్ లో కూడా రోలెక్స్ పాత్ర కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇక రోలెక్స్ తోనే సపరేట్ మూవీ అంటే.. సూర్య ఫ్యాన్స్ కు ఇది పూనకాలు తెప్పించే న్యూస్ అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం తలపతి విజయ్ తో మూవీ చేస్తున్న లోకేశ్ కనకారాజ్. ఆ తరువాత ఖైదీ 2 , విక్రమ్ 2.. మూవీస్ చేయనున్నాడు.. మరి రోలెక్స్ పాత్రతో మూవీ ఎప్పుడు తెరపైకి తీసుకొస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

పుష్ప 2.. సుక్కు నయా ప్లాన్ ?

మహేశ్ రాజమౌళి ప్రాజెక్ట్ ఒకే కావడానికి అసలు కారణం ఆదేనా?

కే‌జి‌ఎఫ్ ను ఫాలో అవుతున్న సలార్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -