Tuesday, May 7, 2024
- Advertisement -

మెగా వినాయక చవితి!

- Advertisement -

మెగాస్టార్ ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. చిరంజీవి ఫ్యామిలీలో వారసురాలి ఎంట్రీ తర్వాత వచ్చిన తొలి పండగ వినాయకచవితి కావడంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు….ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్థిస్తున్నాను అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు చిరు. ఈ పండగ మాకు చాలా ప్రత్యేకమైనదని. ఎందుకంటే చిన్ని ‘క్లీన్‌ కారా’తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూతురు మట్టి గణనాథుడిని తయారుచేయగా ఈ గణనాథుడినికే మెగా ఫ్యామిలీ ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. మెగా ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్‌లో చూసిన ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -