Thursday, May 2, 2024
- Advertisement -

షూటింగ్‌లో మరోసారి గాయపడిన హీరో విశాల్‌..

- Advertisement -

ఒకప్పుడు హీరో ఫైట్స్ స్టంట్ మాస్టర్స్ డూప్ తో కవర్ చేసేవారు. కానీ ఈ మద్య కొంత మంది హీరోలు డూప్ లేకుండ ఫైట్ సీన్లలో పాల్గొంటున్నారు. కొన్ని సార్లు ప్రమాదాలకు గురి అవుతున్నారు. తాజాగా స్టార్ హీరో విశాల్ ఓ ఫైట్ సన్నివేశంలో డూప్ లేకుండా పాల్గొన్నారు. ఈ క్రమంలో అతనికి స్వల్ప గాయాలు అయ్యాయి.

హీరో విశాల్ ప్రస్తుతం 31వ ’నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ చిత్రం షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకి శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తోన్న స‌మ‌యంలో ఆయ‌న‌ గోడను ఢీకొని ప‌డిపోవ‌డంతో తీవ్ర గాయమైంది. దీంతో విశాల్‌ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. వెంట‌నే వైద్యులు చికిత్స అందించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని సినిమా బృందం తెలిపింది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమ్యాక్స్ స‌న్నివేశాల‌ను హైదరాబాదులో చిత్రీక‌రిస్తున్నారు. ఇదే సినిమా షూటింగ్ లో గ‌తంలోనూ విశాల్ గాయాల‌పాల‌య్యాడు. అప్ప‌ట్లో ఆయ‌న తల, కంటికి స్వల్ప గాయాల‌య్యాయి. ఆ ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే ఆయ‌న మ‌రోసారి గాయాల‌పాలవ్వ‌డం గ‌మ‌నార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -