మరో స్టార్ హీరో మూవీ ఓటీటీ బాట..!

- Advertisement -

కరోనా కారణంగా థియేటర్లలో సినిమాల విడుదలకు అవకాశం లేకపోవడంతో ముందు తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలన్నీ ఓటీటీలో వరుసగా విడుదలయ్యాయి. అయితే ఇప్పటికిప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేకపోవడం, ఒకవేళ ఓపెన్ చేసినా ప్రేక్షకులు థియేటర్ల వద్దకు వస్తారో లేదో అన్న సందేహంతో అగ్ర హీరోల సినిమాలు కూడా ఓటీటీ బాట పడుతున్నాయి.

నిన్న అమెజాన్ ప్రైమ్ లో అగ్ర హీరో వెంకటేష్ నటించిన నారప్ప సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో అగ్ర హీరో సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో నే విడుదల కాబోతుంది. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా టక్ జగదీష్. ఈ సినిమాలో రీతువర్మ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

- Advertisement -

ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 23వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా వేశారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే ఆలస్యం కావడంతో ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ నిర్వహించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా హక్కులను అమెజాన్ పై కొనుగోలు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలోనే టక్ జగదీష్ విడుదలకు సంబంధించి అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Also Read

సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..! బ్రేక్ పడేదేలా..!

మాస్​మహారాజా సరసన మలయాళ భామ

‘తమిళ’ బాట పట్టిన బోయపాటి?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -