- Advertisement -

రొమాన్స్ విషయంలో ఆ హీరోకి భార్య ఫుల్ స్వాతంత్ర్యం ఇచ్చిందట!

- Advertisement -

చాలా మంది హీరోల దగ్గర జర్నలిస్టులు తరచూ ఒక మాట అడుగుతూ ఉంటారు. అది కూడా పెళ్లి అయిన హీరోల దగ్గర ఈ కొశ్చన్ కంపల్సరీ! మీరు రొమాంటిక్ సీన్లలో నటిస్తున్నప్పుడు మీ ఇంట్లో  వాళ్లు.. ప్రత్యేకించి మీ భార్య ఏమీ అనదా? అనే కొశ్చన్ అడుగుతారు.

మంచు విష్ణువర్ధన్ బాబు విషయంలో కూడా ఇదే జరిగింది. తాజాగా డైనమేట్ సినిమా విడుదల నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా మీడియా మంచు వారబ్బాయిని ఈ విషయం అడిగింది. పెళ్లి అయ్యి.. ఇద్దరి పిల్లల తండ్రి అయిన విష్ణును రొమాంటిక్ సీన్లలో నటించే విషయంలో భార్య నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనే ప్రశ్నను అడిగింది మీడియా.

దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ… తనకు ఆ విషయంలో భార్య పూర్తిగా స్వతంత్ర్యం ఇచ్చిందని వ్యాఖ్యానించాడు. సినిమాల్లో రొమాంటిక్ సీన్లలో నటించడంపై ఆమెకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. అంతే కాదు.. తనదైన శైలిలో మాట్లాడుతూ… ఎక్కడైనా తిరుగు సాయంత్రానికి ఇంటికి రా.. అని తన భార్య తనకు పర్మిషన్ ఇచ్చిందని విష్ణు తేల్చి చెప్పాడు! ఇదంతా సరదాగానే లెండి. భార్యవైపు కొంటెగా చూస్తూ విష్ణు అలా మాట్లాడాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -