Friday, April 19, 2024
- Advertisement -

స్టేజ్ మీదనే కొట్టుకున్న అప్పరావు, భాస్కర్ (వీడియో)

- Advertisement -

జబర్దస్త్ షోకి పాపులార్టీ బాగా ఉండటంతో మరికొంత మందికి అవకాశం ఇస్తూ ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు షోస్ కు అదిరిపోయే క్రేజ్ ఉంది. ఇక్కడి కమెడీయన్స్ బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లి అక్కడ రాణిస్తున్నారు. అయితే ఈ జబర్దస్త్ కార్యక్రమం నిత్యం ఏదో ఒక వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటుంది.

తాజాగా రిలీజ్ అయిన ప్రోమో మరింత వివాదంగా మారేట్టు కనిపిస్తోంది. జబర్దస్త్ స్టేజ్‌పై ఆర్టిస్ట్‌ల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగినట్టుగా ప్రోమోలు కట్ చేస్తుంటారు. స్కిట్స్‌లో భాగంగా కొట్టుకోవడం, గాయాలు కావడం, కిందపడటం జరుగుతూ ఉంటుంది. అయితే వీటిని ఒక్కోసారి ప్రోమోల వరకే పరిమితం చేస్తుంటారు. వచ్చే వారం ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్, అప్పారావ్ మధ్య పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తోంది.

బెత్తం దెబ్బలతో ఈ స్కిట్ చేశారు. స్కిట్‌లో భాగంగా బుల్లెట్ భాస్కర్ పర్ఫామ్ చేస్తూ.. అప్పారావ్‌ను బెత్తంతో కొడుతూనే ఉన్నాడు. అప్పటికే బాగా దెబ్బలు తిన్న అప్పారావ్.. అసభ్య పదజాలంతో విరుచుకపడ్డాడు. చొక్కా విప్పి పడ్డ వాతలను చూపిస్తూ స్టేజ్ మీది నుంచి వెళ్లిపోయాడు. అయితే నిజంగా సీరియస్ ఇష్యూనా ? లేక స్కిట్ లో భాగమేనా ? అన్నది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే. అయితే ఇందుకు సంబంధించిన ప్రోమోని చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -