Saturday, April 20, 2024
- Advertisement -

అమల పాల్ కు మళ్లీ పెళ్లైందా ?

- Advertisement -

అమల పాల్ తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ సంపాధించుకున్న హీరోయిన్. స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఈమెకు వివాదాలు కొత్తేమీ కాదు. ఏదో ఒక విషయంలో మీడియాలో హైలైట్ కావడం కూడా అమలకు సర్వసాధారణం. రీసెంట్ గా మరోసారి అలాంటిదే జరిగింది. గాయకుడు భవిందర్ సింగ్ తన ఇస్టాగ్రామ్ ద్వారా ఫోటోలు షేర్ చేసి.. కొద్ది క్షణాల్లోనే వాటిని డిలీట్ చేశాడు.

అయితే ఆ ఫోటోలు కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. భవిందర్ సింగ్-అమల పాల్ ఇద్దరి పెళ్లి ఫోటోలలాగా ఉండడంతో వారి వివాహం జరిగిందని మీడియాలో న్యూస్ వచ్చేసింది. ఇద్దరూ పంజాబీ సంప్రదాయ దుస్తులు ధరించడంతో పాటుగా.. మోడరన్ స్టైల్ లో మ్యారేజ్ కిస్సు కూడా ఇచ్చుకున్నారు. అమల సీక్రెట్ మ్యారేజ్ ఫోటోలు అంటూ ఎంతో హంగామా జారింది. అయితే ఈ విషయంపై అమల అధికారికంగా స్పందించలేదు.

ఈ విషయం నిర్దారణ చేసుకునేందుకు అమలను సంప్రదిస్తే తన మేనేజర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. అది తనకు భాగస్వామ్యం ఉన్న కంపెనీ ప్రమోషన్ కోసం చేసిన ఓ క్యాజువల్ ఫోటోషూట్ మాత్రమే అని చెప్పింది. అసలు నేను సీక్రెట్ గా ఎందుకు పెళ్లి చేసుకుంటాను.. కనీసం డిజైనర్ దుస్తులు కూడా ధరించకుండా ఎలా?? అంటూ మీడియాకే తిరిగి ప్రశ్నలు సంధించింది. అయితే ఆ ఫోటోలు చూసినవారికి ఇది నిజంగా పెళ్లై అంటున్నారు. ఏది ఏమైన హీరోయిన్ పెళ్లి అంటే హాట్ టాపికే కదా.. అందుకే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -