Wednesday, May 8, 2024
- Advertisement -

చైతుకు సమంత రాఖీ కట్టేస్తానని బెదిరించిందట

- Advertisement -

అక్కినేని నాగ చైతన్య , సమంతలు మరో నెల రోజుల్లో.. ఒక్కటి కాబోతున్నారు. అక్టోబర్ 6 న అక్కినేని వారింట గోవా వేదికగా పెళ్లి వేడుక జరగబోతుంది. ప్రస్తుతం చైతు నటించిన యుద్దం శరణం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమాలో ప్రమోషన్ లో చైతు చాలా బిజీ బిజీగా ఉన్నాడు.

రీసెంట్ గా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమంతతో ఉన్న రిలేషన్ గురించి ఆసక్తికరైన సంగతులను చెప్పాడు. తన లైఫ్ లో ‘యుధ్ధం శరణం’ సినిమాలో లా పెద్ద యుద్దాలు జరగలేదని.. కానీ సమంతతో ప్రేమలో ఉన్న టైంలో తనతో చిన్న చిన్న యుధ్ధాలు జరిగాయి.. ప్రధానంగా మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి టైం తీసుకున్న సమయంలో సమంత తో చిన్న చిన్న యుద్ధాలు ఎదుర్కోవలసి వచ్చింది. చైతు సమంతల ప్రేమ వ్యవహారం వార్తల్లోకి వచ్చినా నాగార్జున ఒకే చెప్పడానికి కొంత సమయం తీసుకున్నాడు.. దీంతో ఒక రోజు సమంత మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పలేదంటే.. నేను నీకు రాఖీ కట్టవలసి వస్తుంది అని బెదిరించింది.

అసలే అల్లరి పిల్ల.. అంటూ అప్పటి సంగతి ని గుర్తు చేసుకొంటూ నవ్వుకొన్నాడు చైతు. ఇక చైతు నటిస్తున్న యుధ్ధం శరణం రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాలో చైతు సరసన లావణ్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా మంచి సినిమా అవుతుందని చైతు అంటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -