Tuesday, May 21, 2024
- Advertisement -

పార్టీలో ఎక్క‌డా వినిపించ‌ని పీకె పేరు….

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ సీనియ‌ర్లు అంటె గౌర‌వం లేద‌ని,వారిస‌ల‌హాలు తీసుకోడ‌ని ప్ర‌తిప‌క్ష‌పార్టీనుంచె కాకుండా,సొంత పార్టీ నేత‌ల‌నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి వెలిసిందే. అందుకె పార్టీకి చాలామంది సీనియ‌ర్లు దూర‌మ‌య్యారని అంటుంటారు. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు కూడా ఇదే విష‌యాలు వెల్ల‌డించారు. అంది ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేది సందేహ‌మే.

అస‌లు విష‌యానికి వ‌స్తె 2019 ఎన్నిక‌ల వైసీపీ వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌ణు నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట్లో పీకే పేరు బ‌లంగా వినిపించేది. కాని నంద్యాల ఉప ఎన్నిక త‌ర్వాత సైలెంట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఇది పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగానె దూరంగా పెట్టార‌నె విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మొన్నా మ‌ధ్య పీకెను ప‌క్క‌న పెట్టుకొని ముఖ్య పార్టీనేత‌ల‌కు క్లాస్ తీసుకున్నార‌నె వార్త‌లు వినిపించాయి. సీనియర్లుగా మా సలహాల్ని, సూచనల్ని వైఎస్‌ జగన్‌ తీసుకోకుండా….ప్ర‌శాంత్ కిషోర్‌ణు మా నెత్తిన రుద్దుతున్నార‌ని ఆఫ్‌ ది రికార్డ్‌గా కొంతమంది వైఎస్సార్సీపీ సీనియర్‌ నేతలు వాపోయారు.

ప్ర‌స్తుతం ప్రశాంత్‌ కిషోర్‌ పేరు ఎక్కడా విన్పించడంలేదు. జగన్‌ వైఖరిలో ఆ ఎన్నికల తర్వాత చాలా మార్పు వచ్చిందనీ, ఇకపై ప్రశాంత్‌ కిషోర్‌ ఎక్కడా, ఏ వేదికల మీదా కన్పించరన్న సమాధానం వైఎస్సార్సీపీ శ్రేణుల నుంచి ఆఫ్‌ ది రికార్డ్‌గా వస్తోంది. ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ గెల‌వ‌డం స‌హ‌జం. అంత‌మాత్రానికే జగన్‌, ప్రశాంత్‌ కిషోర్‌ని పక్కన పెట్టేయకపోవచ్చు. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ప్రశాంత్‌ కిషోర్‌కి వ్యతిరేకంగా వున్న దరిమిలా, కొంతకాలం పాటు ప్రశాంత్‌ కిషోర్‌ వైఎస్సార్సీపీలో హైలైట్‌ అవడం కష్టమేనని జగన్‌ భావించి ఉండ‌వ‌చ్చు.

పార్టీల‌కు వ్యూహ‌క‌ర్త‌ల అవ‌స‌రం ఎర్ప‌డుతోంది. నరేంద్రమోడీనే, ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాల్ని అనుసరించినప్పుడు, వైఎస్‌ జగన్‌ ఆ వ్యూహకర్తని వినియోగించుకోవడం తప్పెలా అవుతుంది. వ్యూహకర్తని వాడుకునే క్రమంలో సీనియర్లకు, ఇతర నేతలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. జ‌గ‌న్ కి రాజకీయ తత్వం బోధపడి ప్ర‌స్తుతం అ ప‌నె చేస్తున్నాడ‌నుకోవ‌చ్చా..? చూడాలి భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గుతుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -