Thursday, May 9, 2024
- Advertisement -

రొమాంటిక్ చిన్ని కృష్ణుడు ఇప్పుడు ఎక్కడ..?

- Advertisement -

కథా రచయిత అతనికి మంచి పేరుంది. పడయప్పా చిత్రానికి కథా సహాకారం చేశాడు. ఆ సినిమా తెలుగులో నరసింహగా వచ్చింది. ఆ తరువాత నరసింహనాయుడు, ఇంద్ర , గంగోత్రి లాంటి బ్లాక్ బస్టర్స్ నందించాడు. కాని జీనియస్ ,బద్రినాద్ చిత్రాలకు అతనిచ్చిన కథ తేడా కొట్టడంతో పాటు తారా చౌదరి ఎఫైర్లో మనోడు కూడా కృష్ణవేణువు ఊదాడని తెలియడంతో చిన్ని కృష్ణను పక్కకు పెట్టేశారు. దీంతో ఈయనగారి పని అయిపోయిందని అన్నారు.

తాజాగా సొంతూరు తెనాలి నుంచి మరోసారి హైదరాబాద్ వచ్చి… తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడని తెలుస్తోంది. ఈసారి గతంలో మాదిరిగా సినీ పెద్దలు నమ్మేరా లేరు కాబట్టి… ఎవరో ఒక బకరాను పట్టుకుని అటునుంచి నరుక్కు వద్దామని చూస్తున్నాడు. కాని అది కుదరడం లేదు. మంచికథను రాసుకుని కుదిరితే మెగా కాంపౌండ్ ను ప్రసన్నం చేసుకుందామని చూస్తున్నాడు. ఒకవేళ అదీ కుదరని పక్షంలో ముందుగా మనం చెప్పుకున్నట్లు… ఏదో ఒకలా ఫైనాన్షియర్ ఒకరిని పట్టుకుని సినిమాను డైరెక్ట్ చేసే యోచనలు కూడా ఉన్నాయని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఇంతకీ ఉన్నట్టుండి… చిన్నికృష్ణ పేరు ఇపుడు ఇలా ప్రస్థావనకు రావడానికి ప్రధాన కారణం…లండన్ బాబులు చిత్రం. ఈసినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తోన్న చిన్నికృష్ణ వీడు తేడా సినిమాకు పనిచేసిన వాడు. కొత్తబంగారు లోకంలో హాస్టల్ వార్డెన్ గా నటించినవాడు. కాని ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది లండన్ బాబులు చిత్రానికి దర్శకులు కథా రచయిత చిన్నికృష్ణ అని కన్ఫ్యూజ్ పడుతున్నారు. అందుకే అప్పటి చిన్నికృష్ణ ఈ చిన్నికృష్ణ ఒకరు కాదని చెప్పడానికి ..ఆ వేణు కృష్ణుడు ఇపుడు ఏం చేస్తున్నాడో చెప్పడానికి ఈ కంటెంట్ ను ఎంచుకోవడం జరిగింది. అదీ మ్యాటర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -