Sunday, May 4, 2025
- Advertisement -

కాజల్ ని వద్దనుకున్నా హీరోలు ఎవరో…!

- Advertisement -

తేజ దర్శకత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ మరియు కాజల్ అగర్వాల్ కలిసి నటించిన చిత్రం సీత. ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకొని మే 24 న ప్రపంచ వ్యాప్తం గా విడుదల అవ్వడానికి సిద్దం గా ఉంది. అయితే ఈ సినిమా కి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో తేజ చాలా బిజీ గా గడుపుతున్నాడు. చాలా టీవీ ఛానెల్స్ కి కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్న తేజ ఒక ఆసక్తి కరమైన విషయాన్ని చెప్పాడు.

సీత కథ రాసుకున్న వెంటనే కాజల్ అగర్వాల్ తనే ఈ సినిమా లో హీరోయిన్ గా చేస్తాను అని పట్టు పట్టిందట. తేజ కూడా కాజల్ సరిపోతుంది అని ఫిక్స్ అయ్యాక కాజల్ హీరోయిన్ అని చెప్పి చాలా మంది హీరోల దెగ్గరకు కథ పట్టుకొని వెళ్ళాక వాళ్ళందరూ కాజల్ పక్కన చేయడానికి ఒప్పుకోలేదు అట. అయితే చిట్ట చివరగా బెల్లం కొండ శ్రీనివాస్ దెగ్గరకు కథ వెళ్ళగానే తను ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా వెంటనే ఒప్పుకున్నాడు అని తేజ చెప్పాడు.

ఇదంతా చూస్తుంటే ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ కి హీరో కన్న ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అని తెలుస్తుంది. అందుకే కాబోలు మన హీరోలు అందరూ హీరోయిన్ కన్నా తక్కువ ఉండే రోల్స్ కి ఇష్ట పడరు కాబట్టి వద్దు అనుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -