Sunday, May 12, 2024
- Advertisement -

చరణ్ కి పవన్ ని కలవమని ఐడియా ఇచ్చిది ఆయనేనా ?

- Advertisement -

బ్రూస్ లీ విజయం గురించి పవన్ కళ్యాణ్ స్వయంగా చరణ్ ని తన గబ్బర్ సింగ్ షూటింగ్ కి పిలిచి మరీ అభినందనలు తెలిపాడు అంటే ఇదేదో వింతగా అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా ఎవరికీ ఎలాంటి విజయం లోనూ అభినందనలు అందజేయాడు. తన పని తాను చేసుకునిపోవడం తప్ప ఇతర విషయాల మీద పెద్దగా పట్టించుకోడు. 

బ్రూస్ లీ ఆడియో వేడుక కి కూడా వెళ్ళడానికి పెద్ద ఆసక్తి చూపించని పవన్ కళ్యాణ్ బ్రూస్ లీ సినిమా గురించి అంత పక్కగా ఆరా తీసి అతని బిజీ షెడ్యూల్ లో తీరిక చేసుకుని ఆ సినిమా చూసి .. అతనికి నచ్చి .. చరణ్ ని పిలిపించి అభినందించాడు అంటే ఇదేదో ఖచ్చితంగా కోనా వెంకట్ వేసిన మాస్టర్ ప్లాన్ లాగా అనిపిస్తోంది. 

మొన్న శంకరాభరణం సినిమా టీజర్ విడుదల కోసం పవన్ ని సెట్స్ లో కలిసి తన సినిమా కి ఎక్కడ లేని పాపులారిటీ సంపాదించుకున్న కోనా ఇప్పుడు పవన్ ని కలిసి అతని అభినందనలు పొంది మెగా హీరోల మధ్యలో విభేదాలు లేవు అని ఫాన్స్ కి ఉప్పు అందించాలి అని చరణ్ ని కోరాడు అని సమాచారం. మంచి ప్లాన్ వేసాడు , పవన్ ఎలాగో తన దగ్గరకి వచ్చిన వారి పోమ్మనడు, కిమ్మానడు  సో ఇక ఇబ్బందే లేదు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -