Saturday, May 18, 2024
- Advertisement -

చూసికొద్దీ చూడాలనిపిస్తుంది…..

- Advertisement -

తమన్నా అంటే… ఆల్రెడీ నోటెడ్ అయిపోయిన హాట్ బ్యూటీ కదా అనుకోవచ్చు.రాశిఖన్నా అయితే..ఇప్పుడిపుడూ నిలదొక్కుకుంటోన్న తార. అయితే వీరిద్దరు రొమాంటిక్ మూడ్ లోకి ప్రేక్షకుడిని తేవడం కోసం మాస్ రాజాను భలే వాడేసుకుంటున్నారు. చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది అన్నట్లుగా తమన్నా,రాశిఖన్నాల తాజా గరం గరం అందాలు ఊరిస్తున్నాయి.

టాలీవుడ్లో అందాల వేడి మళ్లీ రాజుకుంది.ఎప్పుడు టాప్ గాళ్స్ మధ్యనే ఉండే ఈ పోటీ…. ఈసారి తమన్నా,రాశిఖన్నాల మధ్య కొనసాగుతుంది.దీనికి బెంగాల్ టైగర్ చిత్రం వేదికైంది. ఇప్పటికే బెంగాల్ టైగర్ ఫస్ట్ టీజర్లో తమన్నాను సంపత్ నంది చూపించి చూపించకుండా, కనిపించి కనిపించకుండా ఏదో చూపించేశాడు.తాజాగా వచ్చిన పోస్టర్ తో రాఖిఖన్నా ను కూడా ఇదే మాదిరిగా ఏదో అలా కానిచ్చేశాడు.దీంతో వీరిద్దరిని  ఈసినిమాలో సంపత్ నంది ఎలా చూపించబోతున్నది ఆసక్తికరంగా మారింది.

సాదారణంగా రవితేజ చిత్రంలో హీరోయిన్స్ తో ఎట్ ఎ టైమ్ రొమాన్స్ చేయడం ఎప్పుడో గాని ఉండదు.మరి ఆ రోజుల్లో… విక్రమార్కుడులో అనుష్క, రితికలను  రవితేజ సాంగ్ లో  ఓ రేంజ్ లో వేసుకున్నాడు . మళ్లీ అదే సీన్ ఇపుడు బెంగాల్ టైగర్లో పెట్టారు. తమన్నాను గత కొంతకాలంగా జనాలు చూస్తూనే ఉన్నారు.ఈ మిల్కీ బ్యూటీ ఇప్పటికే చాలా అందాలను ఒలక బోసేసుకుంది. అంతా అయిపోయిందనుకున్న టైమ్లో బాహుబలితో నాలో  విషయం చాలా ఉందనే మ్యాటర్ చెప్పేసింది. అలాగే రాశికన్నా ఈమధ్య నుంచే… ఏదో జిల్ జిల్ మంటూ…. జిగేల్ మనిపిస్తూ ఉంది.ఆ వెలుగు జిలుగులు బెంగాల్ టైగర్లోను కొనసాగిస్తానంటుంది.

అది కూడా అలా ఇలా కాదు. ఓ రేంజ్ లోనే పండగ చేస్కోనేలా చూపిస్తానంటుంది.ఈవిషయంలో ఆమెకు పూర్తి సహాయ సహకారాలను సంపత్ నంది అందిస్తూ ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -