Tuesday, May 14, 2024
- Advertisement -

బిగ్‌బాస్ ఫైన‌ల్‌కు వెళ్లేది ఎవ‌రు?

- Advertisement -

బిగ్‌బిస్ రెండో సీజ‌న్ ముగింపు ద‌శ‌కు చేరుకుంటుంది.బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ప్ర‌స్తుతం 12వ పూర్తి చేసుకుని 13వ వారంలోకి అడుగు పెట్టిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.షో మ‌రికొద్ద రోజుల్లో ముగియ‌నుండ‌టంతో హౌస్‌మెట్స్ టాలెంట్‌ని బ‌య‌ట పెట్టే పనిలో ప‌డ్డాడు బిగ్‌బాస్.హౌస్‌మెట్స్‌కు అదిరిపోయే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. దీనిలో భాగంగానే గార్డీయ‌న్ ఏరియాలో ఒక కారు ఏర్పాటు చేశారు.ఆ కారులో ఎవ‌రు అయితే ముందుగా(అయిదుగురు) ఎక్కుతారో వారు ఈ గేమ్‌కు అర్హులుగా ఉంటార‌ని ప్ర‌కటించాడు బిగ్‌బాస్.

ఈ టాస్క్‌లో కౌశ‌ల్ అనర్హుడిగా ప్ర‌క‌టించి షాక్ ఇచ్చా డు బిగ్‌బాస్.గీతా మాధురి కౌశ‌ల్‌ను ఈ సీజ‌న్ మొత్తం ఎలిమినేట్‌కు నామినేట్ చేయడంతో కౌశ‌ల్ ఈ టాస్క్‌లో ఆడే అవ‌కాశం లేకుండ‌పోయింది.ఇక టాస్క్‌లో అయిదుగురు స‌భ్యులు 24 గంటల సేపు కారులోనే ఉండాలి.ఈ టాస్క్‌లో చివ‌రి వ‌ర‌కు ఎవ‌రు అయితే ఉంటారో వారు నేరుగా బిగ్‌బాస్ ఫైన‌ల్‌కు చేరుకుంటారు.దీంతో హౌస్‌మెట్స్ ఈ టాస్క్‌లో విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు చేరాల‌నే క‌సితో గేమ్ ఆడుతున్నట్లు లెటేస్ట్ ప్రొమోని చూస్తే అర్థం అవుతుంది. ఈ టాస్క్‌కు న్యాయ నిర్ణేత‌గా ఉండ‌ల‌ని బిగ్‌బాస్ కౌశ‌ల్‌ను ఆదేశించ‌డం జ‌రిగింది.ఇక టాస్క్ ముందే రోల్ రైడా డిస్ క్వాలిఫై అయ్యాడు.రూల్స్ వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తించిన రోల్ రోడా అనర్హుడిగా ప్ర‌క‌టించాడు కౌశ‌ల్‌.టాస్క్ బ‌జ‌ర్ మోగ‌గానే ఇంటి సభ్యులంద‌రు కారులో ఎక్కే ప్ర‌యత్నం చేశారు.

శ్యామ‌ల అమీత్‌ను గ‌ట్టిగా నెట్టేయ‌డంతో అమీత్ కారు ఎక్క‌లేక‌పోయాడు.సామ్రాట్‌,గీతా మ‌ధురి,త‌నీష్‌,దీప్తి,శ్యామల లు కారులోకి సురక్షితంగా ఎక్కడం జ‌రిగింది.వీరు కారులో ఉండ‌గానే బిగ్‌బాస్ హౌస్‌లో భారీ వ‌ర్షం ప‌డింది.కారులో ఉన్న దీప్తి చ‌లికి త‌ట్టుకులేక కౌశల్‌ను దుప్ప‌టి అడ‌గ్గా ,కౌశ‌ల్‌నే కారు విండోస్ క్లోజ్ చేసుకోండి చ‌లిగా ఉండ‌దు అని చెప్పాడు.అయిన మ‌ళ్లీ కాసేప‌టికి దీప్తి కౌశ‌ల్‌ను దుప్ప‌టి అడ‌గ‌డంతో కౌశ‌ల్ బ‌దులిస్తు …అలా బెడ్ షీట్ ఇవ్వ‌డం బిగ్‌బాస్ రూల్స్‌కు విరుద్దం అంటు బ‌దులిచ్చాడు.మ‌రి వీరిలో ఎవ‌రు అయితే చివ‌రి వ‌ర‌కు ఉంటారో వారు నేరుగా బిగ్‌బాస్ ఫైన‌ల్ చేరుతారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -