Sunday, May 12, 2024
- Advertisement -

కృష్ణుణి రుద్రాక్ష ఎవరు…?

- Advertisement -

కృష్ణవంశీ అంటేనే… క్రియేటివ్ దర్శకుడని పేరు.అతను ఏం చేసినా,ఎలాంటి చిత్రం చేసినా…తనకున్న ఫార్మాట్  నే నమ్ముకుంటాడు. అందరూ వెళ్లే రూట్లోకి అతను వెల్లడు గాక వెల్లడు. ఇది ఇంతకాలం మనం నమ్ముకున్న, మనకు తెలిసిన కృష్ణవంశీ.

 

ఇపుడు ఆయనలో కూడా మార్పొచ్చిందండోయ్.ఆయనగారు కూడా నలుగురు నడిచే దారిలోనే వెల్లాలని డిసైడ్ అయిపోయాడు. అదేనండి బాబు కృష్ణవంశీ కూడా హారర్ చిత్రాలు చేస్తున్నాడు.సౌత్లో ప్రజెంట్ ఈ తరహా చిత్రాలకు డిమాండ్ భాగా ఉండడంతో ఇటువైపుగా వచ్చేశాడు.

కృష్ణవంశీ చేస్తోన్న చిత్రానికి రుద్రాక్ష అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. ప్రకాష్ రాజ్ తో ఉన్న సాన్నిత్యంతో అతనికి కాస్త వాటా ఇచ్చి…. దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమాను చేద్దామనుకుంటున్నారట. అయితే ఈ సినిమాను ఓన్లీ హారర్ ఎలిమెంట్ తో సరిపెట్టకుండా తనకు భాగా గ్రిప్ ఉన్న రొమాంటిక్ టచ్ ను ఓ రేంజ్ లో ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు.అందుకే కాబోలు కృష్ణుడి రుద్రాక్ష ఎవరని  కాకుండా కృష్ణుని ద్రాక్ష ఎవ్వరూ అని కొశ్చన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ద్రాక్ష పండుగా మారడానికి తమన్నా,రకుల్ ,రాశిఖన్నాలు లిస్ట్ లో ఉన్నారు.సమంతా పేరు కూడా వినిపించినప్పటికీ…ఎందుకో కృష్ణుడు సమంతాను పక్కన పెట్టేశాడట.కృష్ణవంశీ ఆలోచనలకు తమన్నా,రకుల్ ,రాశిఖన్నాలలో ఒకరు సెలెక్ట్ కావచ్చు.చూద్దాం పాలలో మునిగే ద్రాక్ష పండు ఎవరయ్యేది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -