Saturday, May 11, 2024
- Advertisement -

బాహుబలికి ఏ రకంగానూ పోటీకి రాలేక ఓడిన ‘పులి’

- Advertisement -

‘పులి’ సినిమా విషయంలో ప్రధానంగా ఒకటే ప్రచారం చేశారు.. ఈ సినిమా బాహుబలిని మించిపోయేస్థాయిలో ఉంటుందని తమిళ నిర్మాతలు పదే పదే చెప్పారు.

ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో రూపొంది యావత్ దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన ఆ సినిమాకు ధీటైన హిట్ అవుతుందని ప్రచారం చేశారు.  బాహుబలిని మించి పోయే స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని భారీగా ఖర్చు కూడా పెట్టారని.. దీంతో బాహుబలి రికార్డులను పులి దాటేయడం ఖాయమని ప్రచారం జరిగింది.

మరి ఎంతైనా విజయ్ హీరోగా రూపొందుతున్న సినిమా  కావడంతోనే ఔను కాబోలు.. అనుకున్నారంతా. నిజంగానే పులి బాహుబలి సినిమాను కొడుతుందుమో అనుకున్నారు. అయితే తీరా విడుదల అయ్యాకా మాత్రం అంత సీన్ లేకుండా పోయింది. పులి సినిమా తమిళంలోనే ప్లాఫ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక తెలుగులో అయితే సరిగా విడుదలే కాలేదు. దీంతో టికెట్లను కొన్న వారికి కూడా థియేటర్ల వారు డబ్బులు వెనక్కు ఇచ్చి పంపించేశారు. దీంతో “పులి” సినిమా పై భారీగా ఎక్స్ పెక్టేషన్లను పెట్టుకున్న వారు వెనక్కువ చ్చేశారు.

ఓవరాల్ గా పులి విషయంలో ప్రచారం మాత్రం నిజం కాలేదు, బహుబలిని కొడుతుందన్న అంచనాలు నిజం కాలేదు. భారీ బడ్జెట్ ను పెట్టినా.. తమిళులు తెలుగు వారి సినిమాకు ధీటైన సినిమాను తీయలేకపోయారని ఇప్పుడు స్పష్టం అవుతోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -