Sunday, May 19, 2024
- Advertisement -

అంతా వైఎస్సార్‌సీపీ చేసిందంటే పవన్ ఫ్యాన్స్ నమ్మేస్తారా? ఈ నిజాలు చూడరా?

- Advertisement -

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరు నాయకుల కంటే కూడా వ్యక్తిగతంగా జగన్‌కి అత్యంత ఎక్కువగా ప్రజాబలం ఉంది అన్న మాట నిజం. ఇదే విషయాన్ని చాలా సర్వేలు కూడా తేల్చిచెప్పాయి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో అని చెప్పుకునే చంద్రబాబు ఆ విషయంలో జగన్‌కి దరిదాపుల్లో కూడా లేడు. కానీ ఎన్నికల మేనేజ్‌మెంట్, జగన్‌పై ప్రజల్లో సందేహాలు రేకెత్తించడం, మీడియా ప్రచారంతో తనను గొప్పగా చిత్రీకరించుకోవడం లాంటి విషయాల్లో చంద్రబాబు సక్సెస్ అవుతూ ఉన్నాడు.

తాజాగా ఉంటే ఎల్లో బ్యాచ్ అంతా అలాంటి ఒక స్కెచ్ వేశారు. 2019 ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేకంగా పవన్ నిలబడడం ఖాయం.పవన్‌ని పూర్తిగా సమర్థించే కాపుల ఓట్లు పవన్‌కే పడతాయి. అయితే తటస్థులుగా ఉన్న కాపుల ఓట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌కి పడకూడడడదని వ్యూహాలు రచ్చిస్తున్నాడు చంద్రబాబు. ఆ మధ్య మహేష్ కత్తిని అడ్డం పెట్టుకుని పవన్‌ని ఎంతలా బదనాం చేయాలో అంతా చేశారు. పచ్చ మీడియా ఛానల్స్ అన్నీ కూడా మహేష్ కత్తికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు శ్రీరెడ్డి విషయంలో కూడా మహాటీవీ చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. గతంలో ఈ ఛానల్ సుజనా చౌదరి చేతుల్లో ఉండేది. ప్రస్తుతం నారా లోకేషే ఈ ఛానల్ నడిపిస్తున్నాడని ఆ చానల్ జర్నలిస్టులే చెప్తున్నారు. ఇక శ్రీరెడ్డిని ప్రోత్సహించిన ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబుకు సంబంధించినవే. శ్రీరెడ్డి చేత పవన్ కళ్యాణ్‌ని తిట్టించింది కూడా ఆ ఛానల్సే. అయితే ఇప్పుడు మొత్తం వ్యవహారంపై కాపుల్లో ఆగ్రహం కనిపించే పరిస్థితులు రావడంతో అంతా జగనే చేశాడు అని మరోసారి విషప్రచారం మొదలెట్టారు.

ఇక్కడ పవన్ విషయంలో జగన్-చంద్రబాబుల నైజం కూడా చూద్దాం. చంద్రబాబుకు మద్దతు ఇచ్చినప్పటికీ……..తన ఓటమికి కారణమైనప్పటికీ పవన్ విషయంలో జగన్ ఎప్పుడూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది లేదు. ఇక వ్యక్తిగతంగా పవన్‌ని వైకాపా నాయకులతో పాటు జగన్ మీడియా కూడా ఎప్పుడూ విమర్శించలేదు. కానీ ఒకసారి టిడిపికి దూరమయ్యాక మాత్రం చంద్రబాబుతో సహా ఆ పార్టీ నాయకులు, టిడిపి మీడియా సంస్థలు పవన్‌ని ఏ స్థాయిలో టార్గెట్ చేశాయో కనిపిస్తూనే ఉంది. కంటికి కనిపిస్తున్న ఈ నిజాలన్నీ ప్రజలకు అన్ని విషయాలూ తెలిసేలా చేస్తూనే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు శ్రీరెడ్డి లీక్డ్ కాల్ అంటూ మొత్తం వ్యవహారంలో దోషిగా జగన్‌ని నిలబెట్టాలన్న పచ్చ బ్యాచ్ ప్రయత్నం మాత్రం రాజకీయం కోసం మనుషులుగా కూడా దిగజారిపోతున్నారా అన్న ఆవేదన కలుగుతోంది. అసలు ఆ ఆడియో కాల్ ఎలా లీక్ అయింది? శ్రీరెడ్డి చేత వైకాపాని దోషిగా నిలబెట్టాలో ఎవరు మాట్లాడించారు? వ్యక్తిగత కాల్‌లో వైకాపా గురించి ప్రస్తావించాల్సిన అవసరం శ్రీరెడ్డికి ఎందుకు వచ్చింది? నిజంగా శ్రీరెడ్డి వెనుక ఉన్నది వైకాపానే అయితే టివి9, ఆంధ్రజ్యోతి, మహాటీవీలు శ్రీరెడ్డిని అంతలా నెత్తికెత్తుకుంటాయా? అన్న విషయాల గురించి ఆలోచిస్తే వాస్తవాలన్నీ కళ్ళముందు కనిపిస్తాయి. కానీ పవన్ అభిమానులు, కాపు జనాలు, ప్రజలు వట్టి వెర్రిబాగుల వాళ్ళు, అమాయకులు అని ఎల్లో బ్యాచ్ నాయకుడితో సహా అందరికీ ఒక చులకన భావం గట్టిగా ఉంది. అందుకే ఎంతటి అబద్ధాలనైనా ప్రచారం చేస్తూ ఉంటారు అని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయాలను చూస్తున్న సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు. ఇక ఇలాంటి విషపూరిత రాజకీయాలను, ఆ రాజకీయాలు చేస్తున్న నాయకులను ఏం చేయాలో ప్రజలే ఆలోచించుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -