Monday, May 13, 2024
- Advertisement -

లక్ష్మీ ఎన్టీఆర్ లో అన్నగారు ఎవరంటే..

- Advertisement -

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఎన్నో రకాల ఇబ్బందులు వర్మ ఎదుర్కోవల్సి వస్తుంది.అయితే ఇప్పటి వరకు వాటిని తనదైన శైలిలో హ్యాండిల్ చేసిన రాము …ముందు ముందు మరింత కఠినమైన కొశ్చన్స్ ను ఫేస్ చేయాల్సి వస్తుంది. స్వతహాగా వచ్చిన మొండి వైఖరితో వీటిని ఇప్పుడైతే సులభంగా అదిరోహిస్తున్నాడు. సోమిరెడ్డి, అనిత మాటలకు కౌంటర్లు ఇస్తూ వారిని ఖంగు తినిపిస్తున్నాడు.

ఇప్పటి వరకు భాగానే నడిచింది కాని.. ఎన్టీఆర్ పాత్రను ఎవరికి ఆఫర్ చేస్తాడనేదే తెలియకుండా ఉంది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చిత్రాలు చేసిన సందర్భంలో అన్నగారి పాత్రను కోట శ్రీనివాస్ రావుతో వేయించాడు. అది కోటకు ఎంత పెద్ద డ్యామేజ్ అయిందో… తెలిసిందే.ఆయనగారిపై విజయవాడ రైల్వే స్టేషన్లో భౌతిక దాడులు కూడా జరిగేలా చేసింది. అలాగే మోహన్ బాబు పేరు కూడా మొదట్లో వినిపించినా.. లక్ష్మీ పార్వతి అంటే ఆయనకున్న కోపంతో …. ఎందుకొచ్చిన గొడవలే అనుకుని…ఆయన కూడా కామ్ అయిపోయారు. ఇక్కడ ఎవరికి వారు ఆయన పాత్ర వేయడానికి అస్సలు ముందుకు రావడం లేదు.

మరి రాము చేస్తోన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ లో అన్నగారి పాత్ర కోసం వర్మ. .. మళ్లీ ముంబాయి నుంచి స్టేజ్ ఆర్టిస్ట్ ను గాని లేదా.. రక్తచరిత్రలో చేసిన శత్రుఘ్ను సిన్హాను గాని తీసుకోవచ్చు.

ఒకవేల వారు నో అంటే గుర్తింపు కోసం ఢిల్లీ మాస్ కమ్యునికేషన్ స్టూడెంట్స్ ముందుకొస్తే.. వారినైనా తీసుకోవచ్చు.బట్ ఒకటి మాత్రం కన్ఫామ్ తెలుగు నటులెవరు.. తెలిసి తెలిసి అన్నగారి పాత్రను మాత్రం పోషించరు.ఒకవేళ పోషించాల్సి వస్తే… సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ ఫుల్ చదివాకనే .. ఏ వివాదం రాదు అంటే చేయడానికి ఎవరైనా ముందుకు రావచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -