Saturday, May 18, 2024
- Advertisement -

రుద్రమ‌దేవి ప్రమోష‌న్లో మ‌ర్మమేంటి….

- Advertisement -

ఇండ‌స్ట్రీలో  పెద్ద హీరోలంతా….. బాహుబ‌లికంటే ఎక్కువ‌గా రుద్రమ‌దేవికి వంత పాడేస్తున్నారు.నిన్న చిరు అనుకుంటే….. నేడు మ‌హేష్ కూడా రుద్రమ దేవికి నేనున్నానంటూ బ‌య‌ల‌దేరిపోయాడు.

ప్రమోష‌న్లో త‌న వంతు సాయంగా ప్రచార కార్యక్రమాల్లో ఒక‌టి రెండు సార్లు పాల్గొనేలా గుణ‌శేఖ‌ర్ కు మాట ఇచ్చేశాడు.నిజానికి చిరు,మ‌హేష్ లు గుణ‌కు ఇలా మ‌ద్దతిస్తార‌ని ఎవ్వరూ అనుకోలేదు. చిరుకు క‌రెక్ట్ టైమ్లో చూడాల‌ని ఉంది,మ‌హేష్ కు ఒక్కడు లాంటి బ్లాక్ బ‌స్టర్స్ ఇచ్చినందుకు గాను…… ఇపుడ‌త‌ని రుణం తీర్చుకుంటున్నారు.దీనికి తోడు గుణ శేఖ‌ర్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉండ‌టం కూడా ఈ ఇద్దరు దిగ్గజాలు రంగంలోకి రావ‌డానికి కార‌ణ‌మైంది.

ఒక వేల జూలై 10 న వ‌స్తోన్న బాహుబ‌లి సూప‌ర్ స‌క్సెస్ అయితే మాత్రం….. రుద్రమ దేవి మ‌రింత లేటు అవుతుంది. ఎందుకంటే శ్రీమంతుడు కూడా రుద్రమ‌దేవికి అడ్డంకిగా మారింది.

అంతే త‌ప్ప జ‌క్కన్న పై కోపంతో వీరిరువురు రుద్రమ‌దేవికి ప్రమోష‌న్ చేసి పెడుతున్నార‌నే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -