Sunday, May 19, 2024
- Advertisement -

చిరు సందీప్ ని ఎందుకు తిట్టాడు?

- Advertisement -

కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. అయితే సందీప్ కిషన్ ఓ సారి చిరంజీవితో తిట్లు తిన్నాడట. కాకపోతే ఈ విషయం ఇప్పటిది కాదులేండి. చిరు నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నాటి విషయం. ఈ సినిమా వచ్చిన సమయంలో సందీప్ ఇంక హీరో కాలేదు. చిరు అంటే సందీప్ కి చాలా ఇష్టం కావడంతో చిరు ని ఓ సారి చూడాలనిపించిందట.

అయితే శంకర్ దాదా సినిమాకి  పనిచేసిన చోటా కె.నాయుడు సందీప్ కిషన్ కి మేనమామ కావడంతో.. ఆయన్ని తీసుకోని చిరుని చూడ్డానికి వెళ్ళాడు. అదే సమయంలో చిరుపై ఓ సీన్ తీస్తుంటే.. చిరుకి ఎదురుగా సందీప్ నిలబడి నవ్వుతు ఉన్నాడట. దాంతో చిరు పై తీస్తున్న సీన్ పై కాన్సట్రేషన్ చేయలేకపోయాడట. మరో సారి కూడా ఇలానే జరిగిందట.

ఇక చిరుకి కోపం వచ్చి కంట్రోల్ తప్పి.. పక్కకు వెళ్లు అని గట్టిగా తిట్టాడట. దాంతో సందీప్ కిషన్ పక్కకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత చిరు సందీప్ కిషన్ ని పిలిచి.. ఏమీ అనుకోకు అని సర్దిచెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా సందీపే గుర్తు చేసుకొన్నాడు. చిరు తిట్టినా నాకు సూపరే అని చిరు పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకొంటున్నాడు సందీప్ కిషన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -