Friday, May 17, 2024
- Advertisement -

రోజురోజుకు ఎదుగుతున్నాం -సిఎం కెసిఆర్

- Advertisement -

తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించినా అభివ్రద్ధిలో మాత్రం దూసుకుపోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రం ఆదాయం 27.45 శాతం పెరిగిందని ఆయన అన్నారు. సచివాలయంలో ఆర్ధిక శాఖతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం జరిపారు.

ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర ఆదాయం 7,687 కోట్లు ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ శాఖ ఆదాయం భారీగా ఉందని, ఈ రెండు శాఖల్లోనూ ఆదాయం ఊహించని దాని కంటే పెరిగిందన్నారు. ఎక్సైజ్ శాఖ ఆదాయం 120 శాతం, రిజిస్ట్రేషన్ విభాగం ఆదాయం 64 శాతం పెరిగిందని సిఎం కెసిఆర్ చెప్పారు. రాష్ట్రంలో పది కీలక శాఖల్లో ఆదాయం భారీగా పెరుగుతోందని, ఇది శుభసూచకమని అన్నారు. సుస్థిరత, ప్రగతి దిశగా కొత్త రాష్ట్రం పరుగులు తీస్తోందని ఆయన చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -