Saturday, May 4, 2024
- Advertisement -

జబర్దస్త్ నుంచి హైపర్ ఆది అవుట్ …కార‌ణం అదేనా?

- Advertisement -

ఈటీవీ ఛానెల‌లో ప్ర‌సార‌మ‌య్యే ‘జబర్దస్త్’ కామెడీ షో ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే.ఈ షో ద్వారా చాలామంది ఆర్టిస్ట్‌లు ప‌లు సినిమాల‌లో ఛాన్స్‌లు కొట్టేయ‌డం మ‌నం చూస్తునే ఉన్నాం.ఈ షో నుంచి సినిమాలకి వెళ్లినవాళ్లు చాలామందే వున్నారు. ష‌క‌ల‌క శంక‌ర్‌,ధ‌న‌రాజ్‌,చలాకీ చంటి,ఇలా చాలామంది ‘జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు సినిమాల‌లో న‌టిస్తున్నారు.జబర్దస్త్ షోలో హైపర్ ఆది టీమ్ లీడర్ గా కనిపించేవాడు. మొద‌ట్లో అదిరే అభి టీంలో ప‌ని చేసిన చేసిన హైపర్ ఆది త‌రువాత కాలంలో టీం లీడ‌ర్‌గా మారి బాగానే పాపుల‌ర్ అయ్యాడు.

జబర్దస్త్ షో ఆది స్కీట్‌లకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.మ‌రి అలాంటి ఆది గ‌త కొన్ని రోజులుగా జబర్దస్త్ షో లో క‌నిపించ‌డం లేదు.ఆది జబర్దస్త్ షోలో ఎందుకు క‌నిపించ‌డంలేద‌నే దాని గురించి పెద్ద చ‌ర్చ న‌డ‌స్తుంది.దాంతో ఈ విషయంపై ఫిల్మ్ నగర్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.సినిమా అవకాశాలపైనే హైపర్ ఆది పూర్తి దృష్టి పెట్టాడనీ, అందువల్లనే ‘జబర్దస్త్’ నుంచి తప్పుకున్నాడని చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి మెగా ఫ్యామిలీ పట్ల అభిమానాన్ని చూపించే హైపర్ ఆది, ‘జనసేన’ పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసమే ఈ షోకి దూరమయ్యాడని మరికొంతమంది అంటున్నారు. మ‌రి దీనిపై హైపర్ ఆది నుంచి ఎటువంటి స‌మాధానం వ‌స్తుందో అని అంద‌రు ఎదురు చూస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -