Friday, May 3, 2024
- Advertisement -

‘ఎఫ్2’ ఫస్ట్ లుక్ అదిరింది..!

- Advertisement -

సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌,యంగ్ హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతుంది ఎఫ్ 2. ఈ సినిమాకు వ‌రుస హిట్లు కొడుతున్న యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో వెంక‌టేశ్ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ”కుటుంబ క‌థా చిత్రాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న ఔట్ అంట్ ఔట్ ఫ్యామిలీ ఫ‌న్ రైట‌ర్ `ఎఫ్‌2`. మెసేజ్‌తో పాటు అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా యాడ్ చేసి లాఫింగ్ రైడ‌ర్‌లాంటి చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మూడు వ‌రుస హిట్స్ త‌ర్వాత చేస్తోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టి వ‌ర‌కు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. క్లైమాక్స్‌, మూడు పాట‌లు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉన్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -