Saturday, May 4, 2024
- Advertisement -

సాహో సినిమా వాయిదా పడటానికి గల కారణం ఇదేనా?

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావలసి ఉంది. కానీ తాజాగా సినిమా లోని కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యం అవడం వల్ల సినిమా విడుదల వాయిదా పడినట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఆగస్ట్ 15న విడుదల కావాల్సిన ఈ సినిమా ఆగస్టు 30కి వాయిదా పడింది. దీని వెనుక గలా కారణాల గురించి ఇప్పటికే బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం సాహో ట్రైలర్ లో కనిపించిన కొన్ని విజువల్స్ అంత బాగా లేవని, హాలీవుడ్ స్టాండర్స్ కి రీచ్ అవటం లేదని, ముఖ్యంగా ఎడారి బ్యాక్డ్రాప్లో వచ్చే ఇసుక తుఫాను సన్నివేశాలు విజువల్స్ అంతగా ఇంప్రెస్ చేయడం లేదని కొందరు కామెంట్లు చేశారు. పైగా ‘సాహో’ సినిమాలో ఒక సన్నివేశం హాలీవుడ్ ‘మ్యాడ్ మాక్స్’ సినిమా నుండి ఇన్స్పైర్ అయిందని, అలాంటి సన్నివేశం తెరపై ఇంకా బాగుండాలి అని కొందరు అభిమానులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అవుట్ పుట్ ఇంకా బాగా రావడం కోసం నిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -