తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో నిలిచిపోయే పాత్రలు చాలా ఉంటాయి. అలాంటి పాత్రల్లో ఒకటి రాములమ్మ పాత్ర. ఈ పాత్ర పోషించిన విజయశాంతి కి ఎనలేని కీర్తి, పేరు వచ్చాయి. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు అంటే, ఒకప్పుడు అందరూ విజయశాంతి నే అప్రోచ్ అయ్యేవారు. ఆ రకం గా విజయ శాంతి హీరోయిన్ల లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. తర్వాత సినిమాల కి బై చెప్పి రాజకీయాల్లో చేరింది. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ ఉండటం ఆమె అభిమానులకి సంతోషం కలిగించే అంశం..
ఇకపోతే విజయశాంతి కంబాక్ సినిమా మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సరిలేరు నాకెవరు తో జరుగుతుంది. ఇటీవలే మీడియా తో మాట్లాడుతూ విజయశాంతి తనకి సినిమాల కన్నా రాజకీయాలు అంటే నే ఎక్కువ మక్కువ అని, ప్రజా సేవ కి తన జీవితాన్ని అంకితం చేసాను అని చెప్పుకొచ్చింది. ఆ దశ లో నే ఆరు నెలల ముందు ఒక ప్రాజెక్ట్ వస్తే దాన్ని రిజెక్ట్ చేసినట్లు చెప్పింది.
అయితే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం బన్నీ త్రివిక్రమ్ సినిమా లో టబు పాత్ర కి ముందుగా విజయశాంతి ని అనుకున్నారట. చివరికి విజయశాంతి నో చెప్పడం తో వారు టబు ని అప్రోచ్ అయ్యారట.
