Monday, May 20, 2024
- Advertisement -

అది నిజమైతే బొత్స రాజకీయ సన్యాసం చేస్తాడట!

- Advertisement -

వై.సి.పి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ టిడిపిపై విరుచుకు పడ్డారు. తెలుగు దేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రి, ఢిల్లీలో తెలంగాణ మంత్రిని బ్రతిమలాడి కాళ్ళ  బేరానికి పోయారని ఎద్దేవా చేశారు. 

వైయస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌ మోహన్ రెడ్డి టిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌తోనూ,మంత్రి హరీష్‌రావు తో కుట్ర పన్నుతున్నారని టిడిపి నాయకులు చేసిన ఆరోపణాలపై ఘాటుగా స్పందించారు. అసలు కుట్ర పుట్టిందే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నుంచి, మీకే కుట్రల గురించి బాగా తెలుసని ఆయన అన్నారు. ఆనాడు ఎన్‌టి రామారావు గారిని కుట్ర పన్ని, గద్దె దించి, కుట్రకు పునాది వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నుంచే కుట్ర అనే పదం పుట్టుకొచ్చిన మాట వాస్తవం కాదా అని మండిపడ్డారు. 

ఇప్పుడు కేసు నుంచి ఎలా బయటపడాలో పాలు పోక ఢిల్లీలో సుజనా చౌదరి కేటిఆర్ కాళ్ళ బేరానికి వచ్చిన మాట వాస్తవం కాదా అని ఆయన టిడిపిని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో కేంద్ర మంత్రులు, ఎంపీలను ఉపయోగించి ఎన్డీయే పెద్దలను ప్రాధేయపడుతున్నారని అన్నారు. గవర్నర్ మీద మంత్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు. ఒకరేమో గంగిరెద్దు అని, మరొకరేమో దృతరాష్టుడని అంటారు. 

గవర్నర్ పదవి రాజ్యాంగబద్దమైనది, ఆయనతో రాష్ట్రానికి సంబందించి ఏదైనా సమస్య ఉంటే కేంద్రానికి పిర్యాదు చేసుకోవాలి తప్ప ఆయనను విమర్శించడం సమంజసం కాదని హితవు పలికారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు మాత్రం ఎవరినీ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్తున్నారు. అంటే రాజీ చేసుకుందామనా..! అని ప్రశ్నించారు. ఏపి మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలకు బొత్స సత్య నారాయణ సవాల్ విసిరారు.    

ఆ సవాల్ ఏంటంటే ఎల్విస్ స్టీవెన్సన్ కు ఆ ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ వ్రాసారని, అందుకే ఆయన ఇప్పుడు ఈ ఓటుకి నోటు వ్యవహారంలో తెలంగాణా ప్రభుత్వానికి కో-ఆపరేట్ చేశారని, ఈ స్కెచ్ వేసేందుకు జగన్మోహన్ రెడ్డి, హరీష్ రావుతో కలిసి సదరు ఎమ్మెల్యేలతో సరిగ్గా పదిరోజుల క్రితమే సమావేశమయ్యారని ఆంద్రప్రదేశ్ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా ఒక ఆరోపణ చేశారు. దానిని ఆయన నిరూపిస్తే తను రాజకీయాల నుండి తప్పుకొంటానని బొత్స వారికి సవాల్ విసిరారు.

మరి టిడిపి దీనిని స్వీకరిస్తుందో లేదో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -