Tuesday, May 7, 2024
- Advertisement -

చార్మి సినిమా ‘వందకోట్ల” రేంజ్ లో ఉంటుందా?!

- Advertisement -

చార్మిని ప్రధానపాత్రలో పెట్టి దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన సినిమా “జ్యోతిలక్ష్మి’ మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రచారంలో నిమగ్నమైంది ఈ సినిమా యూనిట్. ఈ సందర్భంగా వారు చెబుతున్న విశేషాలే చాలా ఆసక్తికరంగాఉన్నాయి.

ప్రత్యేకించి చార్మి తన సినిమా ప్రమోట్ చేసుకొంటూ ఆసక్తికరమైన విషయాలు చెబుతోంది. ఇది వంద కోట్ల రూపాయల స్థాయి సినిమా అన్నట్టుగా మాట్లాడుతోంది ఆమె.

ఇదొక భిన్నమైన ప్రయోగం అని.. దీన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని చార్మి చెబుతోంది. హిందీలో ఈ మధ్య కాలంలో మహిళా ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన సినిమాలు వచ్చాయని వాటికి మంచి ఆదరణ లభించిందని.. తమ సినిమాకు కూడా అలాంటి ఆదరణేలభిస్తుందని చార్మి విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా చార్మి హిందీ సూపర్ హిట్ సినిమాలకు తమ సినిమాకూ పోలిక పెట్టుకొంది.

సూపర్ హిట్స్ గా నిలిచిన “తనూవెడ్స్ మనూ” ”మేరికోమ్” వంటి సినిమాలు వంద కోట్ల రూపాయల పై స్థాయి వసూళ్లు సాధించాయని.. ఆ విజయాలు తమకూ స్ఫూర్తిని ఇచ్చాయని చార్మి చెప్పుకొస్తోంది. మరి సినిమా విజయం మీద ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయడం వరకూ ఓకే కానీ.. ఏకంగా వంద కోట్ల రూపాయల ప్రాజెక్టులతో పోలిక పెట్టుకోవడమే కొంత విచిత్రం!

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -