Saturday, May 18, 2024
- Advertisement -

పవర్ స్టార్ సినిమా అక్కడ రికార్డులు సృష్టించేస్తోంది..!

- Advertisement -

‘అత్తారింటికి దారేదీ’ టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించగా.. రచయిత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

వంద కోట్ల రూపాయల వసూళ్లను సాధించేంత వరకూ వెళ్లింది.

మరి ఈ సినిమా రేంజ్ కేవలం తెలుగుకుమాత్రమే పరిమితం కావడం లేదు.. ఇది పక్క భాషల ఇండస్ట్రీల్లో కూడా సంచలన విజయం సాధిస్తోంది. 

తాజాగా ఈ సినిమా కన్నడ సినీ ఇండస్ట్రీలో సంచలనాలనే నమోదు చేస్తోంది. ఈసినిమాను కన్నడలో సుదీప్ రీమేక్ చేశాడు. పవన్ తెలుగులో చేసిన పాత్రను సుదీప్ పోషించాడు. ఇటీవలే విడుదల అయిన ఆ సినిమా కన్నడ ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తోంది. ఈ సినిమా తొలి రోజే ఏకంగా 3.65 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. 

తొలి వారంలో ఈ సినిమా మొత్తం పది కోట్ల రూపాయల మొత్తాన్ని వసూలు చేసినట్టుగా బోగట్టా. ఈ విధంగా ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయని  అక్కడి ట్రేడ్ పండితులు అంటున్నారు. కలెక్షన్ల విషయంలో ఇది మరింతగా దూసుకుపోతుందని.. వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని వారు అంటున్నారు. మొత్తానికి ఒక తెలుగు సబ్జెక్ట్ కన్నడలో కూడా సంచలన విషయం సాధించడం విశేషమే కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -